Sunday, September 15, 2024

కెటిఆర్ సంచలన ప్రకటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విజయవంతం అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కాలేదని, కాకపోతే వారి కుటుంబ పర్యటన మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయిందన్నారు.

ఆదాయపు పన్ను చెల్లించారని, రేషన్ కార్డులేదని చాలా మంది రైతులకు రుణమాఫీ చేయలేదని కెటిఆర్ అన్నారు. అర్హులందరికీ రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి నిరూపిస్తే, తాను తన ఎంఎల్ఏ పదవికి రాజీనామాచేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని కెటిఆర్ స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా ఏ నియోజకవర్గానికి అయినా మీడియాను తీసుకొస్తే…చర్చకు తాము సిద్ధమని కూడా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News