Sunday, June 16, 2024

మానవత్వం చాటుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో హాస్పిటల్‌కు తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉండగా, ఎంఎల్‌సి ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటువైపుగా నర్సంపేటకు వెళ్తున్న కెటిఆర్ అతన్ని చూసి వెంటనే కారు దిగారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించారు. సకాలంలో స్పందించి బాధితుడికి అండగా నిలిచిన కెటిఆర్‌ను పలువురు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News