Saturday, August 16, 2025

పోలవరంను.. కూలవరం అనే ధైర్యం ఉందా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ కుంగిపోవడంపై కాంగ్రెస్, బిజెపికి మాట్లాడే ధైర్యం ఉందా అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. జాతీయ హోదా ఇచ్చి, ఎన్డీఏ ప్రభుత్వమే నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం కుంగిపోయి, కొట్టుకుపోయినా NDSAకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అదే కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే.. కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బిజెపి నేతలకు పోలవరంను.. కూలవరం అనే దమ్ము ధైర్యం ఉందా? అని నిలదీశారు.

“అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే NDSA ను దించి బిఆర్ఎస్ పై బురజల్లిన బిజెపి నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారు?. తెలంగాణకు వరప్రదాయిన అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరంకు మరో నీతా?. ఏకంగా 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యాంను గుట్టుచప్పుడు కాకుండా ఎపిలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తున్నారు. అదే తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్ పోయలేదు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే” అని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News