- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి కెటిఆర్ ఫైరయ్యారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం కెటిఆర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్.. హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలేనని రుజువైందన్నారు.
“బీసీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు. నిన్న సమర్పించిన డేటాపై ప్రభుత్వానికి అవగాహన లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుంది. యూటర్న్ తీసుకుని కేంద్రంపై నెపం పెడుతున్నారు. రాహుల్‌గాంధీ తనపేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలి” అని కెటిఆర్ దుయ్యబట్టారు. కాగా, నిన్న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎస్సీ వర్గీకరణ, బీసీ డిక్లరేషన్ నివేదకలపై చర్చ పెట్టిన సంగతి తెలిసిందే.
- Advertisement -