Thursday, October 10, 2024

గాంధీ ఆస్పత్రిలో వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వెళ్లకుండా బిఆర్‌ఎస్ నిజ నిర్ధరణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజనిర్ధరణ కమిటీ వేశామని, గాంధీ ఆస్పత్రికి కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరని ధ్వజమెత్తారు. గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాల విషయంలో వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు తమ పోరాటం ఆగదని కెటిఆర్ హెచ్చరించారు. గాంధీ ఆస్పత్రికి బిఆర్‌ఎస్ నేతల పర్యటన దృష్ట్యా అక్కడ పోలీసులు భద్రతను పెంచారు. గాంధీ ఆస్పత్రిలోకి బిఆర్‌ఎస్ నేతలు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సంజయ్ , గోపినాథ్, ఆనంద్‌లో గాంధీ ఆస్పత్రికి బయలుదేరారు. తెలంగాణలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం కమిటీని బిఆర్‌ఎస్ అధిష్ఠానం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News