Saturday, October 5, 2024

‘ఎవడి చావు వాడు చస్తాడు, మాకేం సంబంధం’: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ఎవడి చావు వాడు చస్తాడని, తమకేం సంబంధం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని చురకలంటించారు. మంగళవారం కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. జనాలు రోగాలు, నొప్పులు, వ్యాధులతో బాధలు పడుతుంటే జనానికి చలనం లేదని ఎద్దేవా చేశారు. జనాలు జ్వరంతో చస్తుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కెటిఆర్ దుయ్యబట్టారు. విష జ్వరాలు విజృంభించి ప్రజలు ఒళ్లు, ఇళ్లు గుళ్ల చేస్తుంటే పట్టించుకునే నాథుడే కనిపించడంలేదన్నారు. బస్తీలకు సుస్తీ చేసిందని, పల్లెలు మంచం పట్టినా కూడా వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్టు కూడా లేదని చురకలంటించారు. పారిశుధ్య నిర్వహణ అస్త్యవస్తంగా మారడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, ప్రభుత్వ శాఖలు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని కెటిఆర్ మండిపడ్డారు. ప్రాణాంతక రోగాలు పట్టి పీడిస్తుంటే అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News