Wednesday, July 2, 2025

కర్ణాటక తరహాలో రాష్ట్రంలోనూ ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపు రోజు ఎంతో దూరంలో లేదు : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కర్ణాటక తరహాలో రాష్ట్రంలోనూ ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపు రోజు ఎంతో దూరంలో లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై ఎక్స్ వేదికగా కెటిఆర్ స్పందించారు. ఏదైనా ఉచితంగా ఇస్తామని అంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని పేర్కొన్నారు. ఉచితంగా ఇస్తామని చెబుతున్నారంటే ఎప్పటికైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. బస్ ఛార్జీల పెంపు విషయంలో తెలంగాణ ఆర్‌టిసి కూడా కర్ణాటకను అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని కెటిఆర్ జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News