Friday, June 6, 2025

చిన్ననాటి స్నేహితురాలితో కుల్దీప్ నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

లక్నో: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలో బుధవారం (జూన్ 4) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కుల్దీప్ నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ రింకు సింగ్‌తో సహా పలువురు ఉత్తరప్రదేశ్ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. కాగా, వంశిక కాన్పూర్‌కు చెందిన అమ్మాయి. ఆమె తండ్రి LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో పనిచేస్తున్నారు.

ఇక, 2017లో అంతర్జాతీయ క్రికెట్ లోకి కుల్దీప్ అరంగేట్రం చేశాడు. తర్వాత అత్యంత విశ్వసనీయమైన పరిమిత ఓవర్ల బౌలర్లలో ఒకరిగా ఎదిగాడు. ఇప్పటివరకు వన్డేల్లో కుల్దీప్ 180 వికెట్లకు పైగా పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News