Wednesday, August 20, 2025

విషాదం: నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతి

- Advertisement -
- Advertisement -

కర్నూలు: జిల్లాలోని ఆస్పరి (Kurnool Aspari) మండలం చిగలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందింది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులని తెలుస్తోంది. పాఠశాల ముగిసిన అనంతరం ఏడుగురు విద్యార్థులు కలిసి గ్రామ శివారులో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కుంటలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కుంటలోకి ఈతకు దిగిన ఆరుగురు విద్యార్థులు మునిగిపోయి మృత్యువాతపడ్డారు. మరో విద్యార్థి ఈ దుర్వార్తని గ్రామస్థలకు సమాచారం అందించాడు. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలి గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News