Wednesday, October 9, 2024

ముంబై ఆస్పత్రిలో లాలూ ప్రసాద్‌కు యాంజియోప్లాస్టీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో యాంజియోప్లాస్టీ నిర్వహించారు. బుధవారం ఆయన ఆస్పత్రిలో చేరారు. మరో రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2014లో ఆయనకు ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లోనే అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ జరిగింది. ఆ తరువాత 2018, 2023 లో ఆయన ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News