Friday, March 29, 2024

ఈటల అనుచరుల భూకబ్జా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి నేత ఈటల రాజేందర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై భూ కబ్జా ఆరోపణలు ఉండగా తాజాగా అయన అనుచరులపై కూడా భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. 200 దళిత కుటుంబాలకు చెందిన భూమిని ఈటల రాజేందర్ బంధువులు, అనుచరులు అక్రమంగా కబ్జా చేశారని బాధితులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు వేడుకున్నాయి. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో బాధితులు మంత్రి కొప్పులను కలిశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2001లో అప్పటి ప్రభుత్వం కూకట్ పల్లి మండలం శంశిగూడ, ఎల్లమ్మబండ గ్రామ పంచాయతీల పరిధిలో సర్వే నంబర్ 57లో 200 మంది దలిత కుటుంబాలకు భూమి పట్టాలు ఇచ్చిందని తెలిపారు.

ఆ భూములను ఈటల రాజేందర్ బంధువులు, అనుచరులు అక్రమంగా కబ్జా చేశారని, దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తమ భూములపూ కన్నేసిన వారు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ అనుచరుల భూ కబ్జాలపై ఈడి, విజిలెన్స్ విచారణ చేయాలని బిజెపి అగ్ర నాయకులకు కూడా లేఖ రాసినట్లు బాధితులు తెలిపారు. వారి ఫిర్యాదును సావధానంగా విన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. భూ కబ్జాకు సంబంధించిన వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News