Monday, May 19, 2025

పాక్‌లో లష్కరే ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

సింధూ ప్రాంతంలో గుర్తుతెలియని
దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి
నాగ్‌పూర్, బెంగళూరు, రాంపూర్
ఉగ్రదాడుల సూత్రధారి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని సింధు ప్రాం తం లో లష్కరే తోయిబా ప్రముఖ నేత, ఉగ్రవాది రజాఉల్లా నిజామనిని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం చంపివేశారు.ఆయనకు అబు సైఫుల్లా ఖాలీద్ అనే మరో పేరు కూడా ఉంది. నిజమని 2006లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో వ్యూహకర్త. ఆయన సింధు ప్రాంతంలోని మత్లీలో సాయుధ బలగాల కాపలా నడుమ తన నివాసం నుంచి బయటకు వచ్చిన దశలో గుర్తు తెలియని వ్య క్తులు దాడికి దిగారని అధికారులు తెలిపారు. అతి దగ్గరి నుంచి ఆయనపై కాల్పులు జరిపి దుండగులు ఫరారయ్యారని వెల్లడైంది. రోడ్డు కూడలి వద్ద హత్యోదంతం జరిగింది. ఈ ఉగ్రవాదికి చాలాకాలంగా బెదిరింపులు వస్తూ ఉన్నందున పాక్ ప్రభుత్వం బహిరంగంగానే ఆయనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే భద్రతా సిబ్బంది కన్నుగప్పి దుండగులు ఆయనను కాల్చి చంపినట్లు వెల్లడైంది. భారతదేశంలో పలు దాడులతో ఆయనకు సంబంధం ఉంది. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై దాడి కీలక ఘటన . కాగా ఈ లష్కరే నిర్వాహకుడు బెంగళూరులో 2005లో ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్సెస్ కార్యాలయంపై జరిపిన దాడిలో కూడా చురుగ్గా వ్యవహరించాడు.

అంతేకాకుండా 2001లో రాంపూర్‌లోని సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై కూడా ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయ్యాడు. భారతదేశంలో జరిగిన మూడు అతి పెద్ద ఉగ్రదాడులలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం ఈ లష్కరేకు భారీ స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసింది. తాను ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియకుండా వ్యవహరించడం, అనేక ప్రాంతాల్లో అనేక పేర్లతో తిరగడం ఆయన ప్రత్యేకత. భారత్‌లో మూడు కీలక దాడులకు పాల్పడిన తరువాత ఈ ఉగ్రవాది నేపాల్‌లో కొంతకాలం అలియాస్ పేరుతో ఉన్నాడు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా తనకు పెట్టని కోట వంటి పాకిస్థాన్‌కు చేరుకుని అధికారిక భద్రతను పొందాడు. సింధు ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నాడని వెల్లడైంది. లష్కరేకు అత్యంత కీలక నిర్వాహకుడిగా ఆయన ఉన్నాడు. మూడేళ్ల వ్యవధిలో మూడు ఉగ్రదాడులకు జిహాద్ పేరిట దిగిన ఈ వ్యక్తి చర్యలతో నలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారతీయ నేలపై ఆయన కీలక స్థాయిలో లష్కరే కార్యకలాపాల వ్యాప్తికి కీలక బిందువుగా మారాడు. ఈ వ్యక్తికి వినోదే కుమార్ అనే భారతీయ పేరు కూడా ఉంది.

ఈ పేరుతో నేపాల్‌లో కూడా తన నివాసం సాగించినట్లు వెల్లడైంది. వేరే పేరుతో ఉంటూ , తాను హిందువును అని నమ్మించి స్థానిక నేపాలీ యువతి నగ్బా బానును పెళ్లాడాడు. ఈ వ్యక్తి తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లిన తరువాత ఈ నగ్మా సంగతి ఏమైందో తెలియదు. లష్కరే ఉగ్రవాదుల తయారీ దశలో రహస్యంగా సాదాసీదా వ్యక్తిగా ఉంటూ కార్యకలాపాలు సాగించే వాడు. తరువాత దాడులకు దిగేవాడని తెలిసింది. ఈ వ్యక్తి ఇటీవలే సింధూలోని బదిన్ జిల్లాలోని మతిల్‌లో ఉంటున్న దశలో హతుడయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News