Thursday, April 25, 2024

టిటిడి మొబైల్ యాప్ ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన టిటిడి మొబైల్ యాప్ వచ్చేసింది. ఈ టిటిడి మొబైల్ యాప్ ను టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన యాప్‌ను టిటిడి రూపొందించింది. . టిటిడికి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట ఉండేలా ఈ యాప్ రూపొందించారు.

యాప్ ద్వారా భక్తులు టిటిడి సేవలు పొందవచ్చని టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడికి సంబంధించిన వన్ స్టాప్ విధానంలో భక్తలకు సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. వర్చువల్ సేవలను భక్తులు యాప్ ద్వారా వీక్షించవచ్చని సూచించారు. తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయొచ్చని టిటిడి చైర్మెన్ సుబ్బారెడ్డి తెలిపారు.

ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు రెండేళ్లైన పూర్తి కాలేదని పనులు వేగవంతంగా జరిగేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తున్నామన్నారు. 6 నెలల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రేపు రథసప్తమికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చైర్మెన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News