చెన్నై: తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీస్ స్టేషన్‌లోకి చిరుతపులి వెళ్లింది. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి ఒక రౌండ్ వేసి ఎవరు లేకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. చిరుతపులి బయటకు వెళ్ళగానే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశాడు. ఈ దృశ్యాలు సిసిటివిలో నమోదయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత పులి పోలీస్ స్టేషన్ కు రావడంతో నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో చిరుత ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు లేరని వెళ్లిపోయిందనుకుంటా? అని శివాజీ, నవీన్ అనే నెటిజన్లు కామెంట్లు చేశారు. పోలీసులు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా అని తనిఖీలు చేయడానికి వచ్చిందనుకుంటా? అని అకీరా చరణ్ తేజా అనే నెటిజన్ కామెంట్ చేశాడు. అడవులలో చెట్లను నరికేస్తుండడంతో వన్య ప్రాణులు జీవించడం కష్టంగా మారిందని కంప్లైంట్ చేయడానికి పిఎస్ కు చిరుత వచ్చి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.