- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళాకారులు రాజ్ నాథ్ సింగ్ తిలకించారు. బతుకమ్మ, బోనాలు, కోలాటం, కొమ్ము కోయ, గుస్సాడి కళారూపాల ప్రదర్శన వీక్షించారు.
Also Read : సర్ఫరాజ్‌కు మెట్రో బాధ్యతలు
- Advertisement -