Wednesday, May 22, 2024

రేపు మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, కల్లుదుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను బంద్ చేయాలని పోలీస్ కమిషనర్లు శ్రీనివాస రెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్‌జోషి ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు కలదు. ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా మద్యం షాపులు బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News