Tuesday, December 10, 2024

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై…అంతలోనే వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై లంచం ఆరోపణలపై అమెరికా కోర్టు అభియోగాలు మోపడంతోపాటు, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య తుపాను రేకత్తడంతో పాటు పలు అంశాలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులు పరిశీలన కోసం లిస్ట్ చేయబడ్డాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల కీలక అంశాలు:

  • పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు(నవంబర్ 25)న ప్రారంభమై డిసెంబర్ 20న ముగుస్తాయి.
  • పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ, రాజ్యసభ రెండూ… రోజంతా వాయిదా పడ్డాయి, బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమవుతాయి.
  • పరిశీలనకు తీసుకున్న 16 బిల్లులలో వక్ఫ్ సవరణ బిల్లు ఒకటి. ఉభయ సభల సంయుక్త కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించిన తర్వాత వక్ఫ్ బిల్లు పరిశీలన , ఆమోదం కోసం లిస్ట్ చేయబడింది.
  • ప్రభుత్వం ప్రవేశపెట్టడం, పరిశీలన చేయడం ,ఆమోదించడం కోసం ప్రభుత్వం లిస్ట్ చేసిన ఇతర బిల్లు… పంజాబ్ కోర్టుల(సవరణ)బిల్లు. ఇది ఢిల్లీ జిల్లా కోర్టుల అప్పిలేట్ అధికార పరిధిని ప్రస్తుత రూ. 3 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచడానికి (కేసు యొక్క ద్రవ్య విలువగా నిర్వచించబడింది) ఉద్దేశించింది.
  • మణిపూర్ మారణకాండ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికా కోర్టు లంచం ఆరోపణలపై అభియోగాలు మోపాలని ప్రతిపక్షాలు యోచిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని భావిస్తున్నారు.

అదానీ అంశంపై జెపిసి వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం పెట్టింది. భారత్ లో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చ జరపాలని డిమాండ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News