Tuesday, April 23, 2024

డీప్ ఫేక్ వీడియోలపై అభ్యర్థుల్లో కలవరం

- Advertisement -
- Advertisement -

డీప్ ఫేక్ వీడియోలపై అభ్యర్థుల్లో కలవరం
వాయిస్ క్లోనింగ్‌పై ఆందోళన
సోషల్ మీడియాపై డేగ కన్ను
ఎన్నికల వేళ.. భయపెడుతున్న ఎఐ

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు తాయిలాల వర్షం కురిపిస్తుండగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ(ఎఐ)ను, డీప్‌ఫేక్ టక్నాలజీని కొందరు ఉపయోగించే అవకాశం ఉందని సైబర్‌సెక్యూరిటీ నిపు/లు ఆందోళన చెందుతున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 మధ్య ఏడు దశలలో జరగనున్నాయి. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని వెంటనే గుర్తించి ప్పందించేందుకు స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్‌ఓపి)ను భారత ఎన్నికల కమిషన్ ఇప్పటికే జారీచేసింది.

ఎన్నికల ప్రచార సందర్భంగా దీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్ అనే రెండు సాధనాలను విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసుకు చెందిన సైబర్ క్రైమ్ యూనిట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అటువంటి కంటెంట్‌ను సకాలంలో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవడం పోలీసుల ముందున్న ప్రధాన సవాలని ఆయన చెప్పారు. ఎఐ ద్వారా సృష్టించే ఫేక్ వీడియో కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మధ్య తేడాను ఆటోమేటిక్‌గా గుర్తించే టెక్నాలజీ ఏదీ అందుబాటులో లేదని ఆయన చెప్పారు. ఆ కంటెంట్‌ను గుర్తించే లోగానే అది సోషల్ మీడియాలో దావనంలా వ్యాపించి జరగాల్సిన నష్టాన్ని చేసేస్తుందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. 2024 జనవరిలో అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌కు చెందిన డెమ్రోకటిక్ పార్టీ ప్రైమరీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గొంతును అనుకరిస్తూ ఫేక్ ఫోన్ కాల్స్ ప్రజలకు వెళ్లాయి. ఈ ఎన్నికల్లో పాల్గొంటే సార్వత్రిక ఎన్నికల్లో తాము పాల్గొనే అర్హతను కోల్పోతారంటూ ఓటర్లను బైడెన్ హెచ్చరించే ఫేక్ కాల్స్ వెళ్లడం సంచలనం సృష్టించింది.

అదే విధంగా 2023 ఫిబ్రవరిలో నైజీరియా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా బ్యాలట్ల ద్వారా ఎలా మోసం చేయవచ్చో ఒక అధ్యక్ష అభర్థి చెబుతున్నట్లు బయటకువచ్చిన ఫేక్ ఆడియో కాల్ ఆ అభ్యర్థి విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీసింది. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతలు రుమిన్ పర్హానా బిపున్ రాయ్ స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతున్న డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఎఐతో సృషించే తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజలలో అపనమ్మకానికి దారితీయగలవని మాజీ ఐపిఎస్ అధికారి, సైబర్‌సెక్యూరిటీ నిపుణులు త్రివేణి సింగ్ తెలిపారు. ఎఐ టూల్స్ తయారీ, ఆమోదానికి పారదర్శకమైన మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రభుత్వం సైబర్‌సెక్యూరిటీ నిపుణులు, టెక్ కంపెనీలు, పౌర సమాజ సంఘాలతోసహా సంబంధిత వ్యక్తులతో చర్చలు జరపాలని సింగ్ చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యంతరకర ఆన్‌లైన్ కంటెంట్‌ను తొలగించడానికి ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ(ఐ4సి)ని నోడల్ ఏజెన్సీగా కేంద్రం నియమించింది. అభ్యంతరకర కంటెంట్ గురించి తెలిసిన వెంటనే ఏ రాష్ట్ర పోలీసులైనా ఐ4సికి సమాచారం అందచేసిన పక్షంలో సంబంధిత కంటెంట్‌ను డెలిట్ చేసేందుకు ఆయా సోషల్ మీడియా కంపెనీలను ఐ4సి సంప్రదిస్తుందని ఆయన చెప్పారు. పీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్ గురించి కూడా ఓటర్లను చైతన్యపరచాలని ఆయన అధికారులను కోరారు. ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్‌ను గుర్తించి, తొలగించేందుకు దర్యాప్తు సంస్థలు సోషల్ మీడియా కంపెనీలను నిశితంగా గమనిస్తాయని ఫ్యూచర్ క్రైమ్ రిసెర్చ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు శశాంక్ శేఖర్ తెలిపారు. ఎఐతో తయారు చేసే కంటెంట్‌ను, సింథటిక్ వీడియో, ఆడియో క్లిప్‌లను వెంటనే గుర్తించడం అతి పెద్ద సవాలని ఆయన చెప్పారు. తప్పుడు సమాచారం ఓటరును తీవ్రంగా ప్రభావితం చేయగలదని ఆయన చెప్పారు.

భారతదేశ ఎన్నికలపై అనేక దేశాలు ఆసక్తిని కనబరుస్తునానయని, ఈ దేశాల నుంచి భారీ స్థాయిలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన చెప్పారు. చట్ట పరిధిలో సత్వరమే చర్యలు తీసుకునేందుకు అన్ని జిల్లాలలో సైబర్ సెల్స్ సహకారంతో సోషల్ మీడియా సెల్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దని తమ మద్దతుదారులకు తెలియచేయవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులను కోరినట్లు ఆ అధికారి చెప్పారు. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా నివారించేందుకు సోషల్ మీడియాపై ఇసికి సంబంధించిన మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ గట్టి నిఘా పెట్టిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News