Saturday, April 27, 2024

7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమాయంలో నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. నాలుగో విడతలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగునున్నాయి.

ఈ క్రమంలో ఎన్నికలకు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 29న నామినేషన్లను పరిశీలించనున్నారు. మే 13న పోలింగ్ నిర్వహించి.. జూన్ 4న ఫలితాలను వెల్లడించనున్నారు. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే రోజున జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News