Tuesday, July 1, 2025

పాశమైలారం ఘటనలో ప్రేమజంట మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ ప్రేమ జంట అగ్నికి అహుతైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య సిగాచి పరిశ్రమలో పని చేస్తున్నారు. సోమవారం సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో 37 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులలో ప్రేమ జంట నిఖిల్, రమ్య ఉన్నట్టు తెలిసింది. దీంతో రెండు కుటుంబాల సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నెల రోజుల క్రితం ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన శ్రీరమ్యను జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అషాడం మాసంలో పెద్దల సమక్షంలో ఘనంగా మళ్లీ పెళ్లి వేడుక చేద్దామని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రెండు గ్రామాలలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News