Friday, June 2, 2023

ప్రియురాలితో పారిపోయిన ప్రియుడి ముక్కు కట్ చేసి చితకబాదారు

- Advertisement -
- Advertisement -

జైపూర్: వివాహితను ప్రియుడు లేపుకపోయినందుకు అతడిని ఆమె బంధువులు పట్టుకొని చితకబాది ముక్కు కట్ చేసిన సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగింది. దీంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నాగౌర్ జిల్లాలో రెండు నెలల క్రితం హమీద్ ఖాన్(25) అనే యువకుడు వివాహితతో పారిపోయాడు. దీంతో వివాహిత తండ్రి, సోదరులు స్థానికులు పోలీస్ స్టేషన్‌లో తన కూతురు కనిపించడంలేదని తెలిపారు. హమీద్ తన ప్రియురాలుతో కలిసి గిగల్ గ్రామంలో నివసిస్తున్నారు.

వివాహిత కుటుంబ సభ్యులు ప్రకాశ్ ఖాన్, అజిజ్ ఖాన్, ఇక్బాల్ ఖాన్, హుస్సేన్ మోమిన్, సలీం అనే వారు గిగల్ గ్రామంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి చేరుకొని ఇద్దరిని పట్టుకున్నారు. రటౌ గ్రామంలో వివాహితను భర్తకు అప్పగించారు. అనంతరం మారోత్ గ్రామంలో తండ్రి తన నలుగురు కుమారులు కలిసి హమీద్ ఖాన్ చితక బాదారు. అనంతరం అతడి ముక్కు కట్ చేయడంతో అతడు అపస్మారక స్థితిలో పోయాడు. వెంటనే అతడిని నోవా రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. అతడికి మెలుకువ వచ్చిన వెంటనే పర్బాస్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు వివాహిత తండ్రి, నలుగురు సోదరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన కూతురు ప్రియుడితో లేచిపోవడంతో తన పరువు పోతుందనే భయంతో అతడి దాడి చేశామని నిందితులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News