Tuesday, April 30, 2024

మోదీ ఎన్నికల ప్రచారంపై స్టాలిన్ విసుర్లు

- Advertisement -
- Advertisement -

చెన్నై : ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఇస్తున్న గ్యారంటీలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఎక్స్ (ట్విటర్) లో ఓ జాబితాను పోస్ట్ చేసిన స్టాలిన్ బీజేపీ అందులో ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించగలదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాని చేస్తున్న పర్యటనలను పక్షుల వలసలతో పోల్చారు. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే దేశంలో నెలకొన్న అనేక క్లిష్ట సమస్యలను మోడీ సర్కార్ పరిష్కరించగలదా ? అని సవాల్ విసిరారు.

హామీ కార్డుతో వచ్చిన ఆయన ఈ హామీలను ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల వ్యవహారం, చైనా ఆక్రమించిన భూభాగం, కులగణన వంటి అంశాలను ప్రస్తావించారు. పౌరసత్వ చట్టానికి నోటిఫై చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలన్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లతోపాటు ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వైద్యకళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష (నీట్)ను మినహాయించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News