Saturday, May 4, 2024

సీట్ షేరింగ్ ఫార్ములాను ఖరారు చేసిన మహా వికాస్ అఘాడి

- Advertisement -
- Advertisement -

ముంబై: లోక్‌సభ ఎన్నికలు 2024: మహా వికాస్ అఘాడి సీట్ల షేరింగ్ ఫార్ములాను ఖరారు చేసింది. శివసేన (యూబిటి) 21, కాంగ్రెస్ 17, ఎన్ సిపి (ఎస్ పి) 10 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని సేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ కు సాంగ్లీ, ముంబై సౌత్ సెంట్రల్ లేక భీవండి సీట్లు లభించలేదు. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో శివసేన(యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్రే కూడా పాల్గొన్నారు. ఏ సీటు షేరింగ్ విషయంలోనూ భేదాభిప్రాయం లేదని ఎన్ సిపి (ఎస్ పి) చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ‘పరస్పర ఆమోదం తర్వాత మేము సీట్ షేరింగ్ ను ప్రకటిస్తాము’అని శరద్ పవార్ తెలిపారు.

శివసేన (UBT) సీట్ల జాబితా:

జలగావ్, పర్భాని, నాసిక్, పాల్ఘర్,కళ్యాణ్, థానే, రాయగడ, మావల్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, రత్నగిరి, బుల్దానా, హత్కనంగాలే, షిరిడీ, సాంగ్లీ, హింగోలి,యావత్మాల్-వాషిమ్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై సౌత్, ముంబై నార్త్ ఈస్ట్

కాంగ్రెస్ సీట్ల జాబితా:

నందుర్బార్, ధూలే, అకోలా, అమరావతి, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రపూర్, నాందేడ్, జల్నా, పూణే, లాతూర్, షోలాపూర్, కొల్హాపూర్, రామ్‌టెక్, ముంబై నార్త్, ముంబై నార్త్ సెంట్రల్

NCP స్థానాల జాబితా:

బారామతి, షిరూర్, సతారా, భివాండి, దిండోరి, మధ, రావర్, వార్ధా, అహ్మద్‌నగర్, బీడు

ఎవరైనా ఏదైనా ఆశించినా నష్టం లేదని ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. “కానీ మేము ప్రమాణాల ప్రకారం, సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేసాము” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News