Wednesday, November 13, 2024

నా చావుకు ఇద్దరు ఎస్‌ఐలు, ఓ పార్టీ నేత కారణం

- Advertisement -
- Advertisement -

కానిస్టేబుల్ సాగర్ సెల్ఫీ సూసైడ్ వీడియో..
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
టాస్క్‌ఫోర్స్ సిఐ, ఇద్దరు ఎస్‌ఐలు, రాజకీయ నేతపై ఏన్కూర్ పిఎస్‌లో కేసు

మన తెలంగాణ/బూర్గంపాడు: తన చావుకు ఇద్దరు ఎస్‌ఐలు, ఓ పార్టీకి చెందిన నాయకుడు కారణమంటూ ఓ కానిస్టేబుల్ సెల్ఫీ సూసైడ్ వీడియో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో భూక్య సాగర్ (34) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గతంలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి మాయమైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు గంజాయి మాయమైన సమయంలో స్టేషన్ అధికారిని విచారించకుండా తనపై నిందవేశారని ఆయన ఆరోపించాడు. ఈ ఘటనలో కీలకంగా అప్పటి బూర్గంపాడులో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన అ ధికారి, స్థానిక ఓ పార్టీకి చెందిన నాయకుడు కలిసి గంజాయి వ్యాపారం చేశారని, అదేవిధంగా ఆ ఎస్‌ఐ బదిలీ అనంతరం వచ్చిన మరో ఎస్‌ఐ, ఆ నాయకుడు కలిసి వ్యాపారం చేశారని ఆయన ఆరోపించాడు.

ఈ కేసులో వారంతా తప్పించుకొని కానిస్టేబుల్ అయిన తనపై కేసు నమోదు కావడంతో ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేశారని వాపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ సాగర్ దసరా పండుగ పూట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన చావుకు ఇద్దరు ఎస్‌ఐలు, ఓ పార్టీకి చెందిన నాయకుడు కారణమంటూ సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేశాడు. కుటుంబ సభ్యులు అ తనిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం ఏన్కూర్. అతనికి భార్య తేజశ్విని, పాప, బాబు ఉన్నారు. ఇదిలావుండగా, మృతుడు సాగర్ తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి ఎస్‌ఐ సంతోష్, ఏడూళ్ల బయ్యారం ఎస్‌ఐ రాజ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సిఐ సత్యనారాయణతోపాటు ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు గోనెల నానిపై ఏన్కూ-ర్ పిఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
మనస్తాపానికి గురై గన్‌తో కాల్చుకుని ఘాతుకం

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ః కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ విధి నిర్వహణలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌కేకన్ తెలిపిన వివరాల ప్ర కారం… జిల్లా కేంద్రంలోని గోపాల్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న గుండెబోయిన శ్రీనివాస్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి తన భార్యతో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి.

కాగా, విధుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని కురవి రోడ్డులో ఉన్న ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆదివారం విధుల్లో ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ తన వద్ద గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌పి ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనకు దారితీసిన విషయాలను తెలుసుకున్నారు. జిల్లా ఆస్పత్రి మార్చురీలో శ్రీనివాస్ మృతదేహాన్ని ఉంచారు. కాగా, మృతుడికి భార్య వరలక్ష్మి, కుమారుడు సుశాంత్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News