Tuesday, October 15, 2024

ప్రియురాలిని 59 ముక్కలుగా నరికి… చెట్టుకు ఉరేసుకున్న ప్రియుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రియుడిపై ప్రియురాలు దాడి చేయడంతో పాటు అతడిని పరుషమైన పదజాలంతో దూషించడంతో ఆత్మాభిమానం దెబ్బతింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెపై దాడి చేసి గొంతు నులిమి చంపేశానని నిందితుడు సూసైట్ లేఖలో వివరించాడు. అనంతరం మృతదేహాన్ని స్నానపు గదిలో తీసుకెళ్లి శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి ప్రిజ్ లో భద్రపరిచానని, వాసన రాకుండా రసాయనాలతో పిచికారి చేశానని తెలిపాడు. నిందితుడు బెంగళూరు నుంచి ఒడిశాలోని తన సొంతూరుకు వెళ్లిన తరువాత గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బెంగళూరులో మహాలక్ష్మి మర్డర్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్, నేపాల్ కు చెందిన మహాలక్ష్మి అనే యువతి, యువకుడు ఒకే కంపెనీలో పని చేయడంతో ప్రేమకు దారి తీసింది.

వయ్యాలికావల్ లో మునేశ్వర్ బ్లాక్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. రాయ్ గత కొన్ని రోజుల నుంచి మరో అమ్మాయితో చనువుగా ఉండడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 21 రాయ్ తో మహాలక్ష్మి ఆమె గొడవ పడింది. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకొవడంతో అతడిపై ఆమె దాడి చేసింది. పరుషమైన పదజాలంతో ఆమె దూషించడంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఆమెపై దాడి చేసి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి 59 ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను ఫ్రిజ్ లో భద్రపరిచి, వాసన రాకుండా రసాయనాలతో స్ప్రే చేశాడు. అనంతరం నిందితుడు భయంతో ఒడిశా రాష్ట్రం బద్రక్ జిల్లాలోని తన సొంతూరు కుళేవాడకు వెళ్లిపోయాడు. సూసైడ్ లేటర్ రాసి గ్రామ శివారులోని శ్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకొని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News