Saturday, July 27, 2024

మహారాష్ట్ర సిఎం షిండే నేమ్‌ప్లేట్‌లో చేరిన తల్లిపేరు

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది మే1 న లేదా తరువాత పుట్టినవారి పేర్లలో తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ కార్డులతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఈ విధంగా తల్లిపేరు చేర్చవలసి ఉంటుంది. ఈ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే . సౌత్ ముంబై లోని రాష్ట్ర సెక్రటేరియట్‌లో తన కార్యాలయం బయట నేమ్‌బోర్డులో మార్పులు చేశారు. తన తండ్రి పేరుకు ముందు తల్లిపేరు చేర్చారు. ఇప్పుడీ కొత్త నేమ్‌ప్లేట్‌లో ‘ ఏక్‌నాథ్ గంగూబాయి శంభాజీ షిండే ’ అని పేరు పెట్టారు. రాష్ట్ర మహిళా,

శిశు అభివృద్ధి మంత్రి అడితి తాత్కరే మొదట తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందని, దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రి స్వయంగా తానే తన పేరులోతల్లిపేరు ముందుగా చేర్చి ఆదర్శవంతులయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. డిప్యూటీ సిఎం , సీనియర్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, మరో డిప్యూటీ సిఎం అజిత్ పవార్, కూడా తమ నేమ్‌ప్లేట్‌ల్లో తల్లిపేరును చేర్చారు. ఫడ్నవీస్ నేమ్ ప్లేట్‌లో దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్ అని మారగా, అజిత్ పవార్ నేమ్‌ప్లేట్‌లో అజిత్ అక్షతాయి అనంతరావు పవర్ అనే పేరు పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News