Saturday, April 27, 2024

ఔరంగాబాదీ చల్ చల్ గుర్రం

- Advertisement -
- Advertisement -

Maharashtra man commutes to office on horse everyday

పెట్రోవాతతో మహారాష్ట్రవాలా సవారీ

ఔరంగాబాద్ : పెట్రోలు ధర రోజురోజుకూ క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటంతో మహారాష్ట్రకు చెందిన ఓ బైక్‌వాలా బండి ఇంట్లో పడేసి గుర్రం బాట పట్టాడు. ఇంటినుంచి ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్లుతున్నాడు. ఇంతకు ముందు వరకూ కొవిడ్ దెబ్బతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి, ఇప్పుడేమో పెట్రోలు మంటలు దీనితో మోటార్‌సైకిల్ ప్రయాణం కుదరదని తేల్చుకున్నాడు. ఔరంగాబాద్‌లో ఓ ఫార్మసీకాలేజీలో లాబ్ అసిస్టెంట్ అయితన షేక్ యూసుఫ్ బైక్‌కు బ్రేక్ వేశాడు. గుర్రంపై లాబ్‌కు వెళ్లుతున్నాడు. లీటరు పెట్రోలు రూ 115 దాటింది. ఇక ముందు ఎంతవుతుందో తెలియదు.

వచ్చే అరకొర జీతం బండికి పెట్టాలా? బతుకు బండి నడిపించేందుకు వాడుకోవాలా? తెలియడం లేదని, అందుకే బైక్ ఖర్చు తగ్గించుకోవడానికి గుర్రంపై పనికి వెళ్లుతున్నానని తెలిపాడు. ఇంటి నుంచి ఆఫీసు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకు ముందు లాక్‌డౌన్ల దశలో యూసుఫ్ గుర్రం మీదనే వెళ్లేవాడు. ఇప్పుడు తిరిగి గుర్రంపై ఆధారపడుతున్నానని విలేకరులకు తెలిపారు. ఇంటి నుంచి ఆఫీసుకు తిరిగి ఇంటికి దాదాపు 30 కిలోమీటర్ల వరకూ గుర్రం పై వెళ్లుతున్నానని, అవసరం అయినప్పుడు మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకూ ఈ అశ్వమే దిక్కు అవుతోందని తెలిపారు. బైక్ మీద వెళ్లడం కన్నా తనకు గుర్రం మీదపోవడంతోనే ఆరోగ్యం బాగా ఉంటోందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News