Sunday, October 1, 2023

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆదిలాబాద్ వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి దగ్గర లోయలో కారు పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News