Wednesday, August 27, 2025

గాంధీ మనవరాలు ఉషా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకనీ (89) కన్నుమూశారు. ముంబయిలోని ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు సంవత్సరాల నుంచి మంచానికి పరిమితం కావడంతో వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మహాత్మా గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమంలో చిన్నతనంలో గడిపారు. ముంబయిలో గాంధీ స్మారక నిధికి ఆమె చైర్‌పర్సన్‌గా సేవలందించారు. 2016లో గుజరాత్‌లోని సూరత్‌లో ఉషా గోకనీ సోదరుడు, గాంధీ మనవడు కను రాందాస్ గాంధీ మృతి చెందారు. కను రాందాస్ గాందీ నాసాలో శాస్త్రవేత్తగా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News