Sunday, September 15, 2024

‘ముఫాసా’కి సూపర్ స్టార్ వాయిస్ ఓవర్..

- Advertisement -
- Advertisement -

బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. 2019లో లైవ్- యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ముఫాసా: ది లయన్ కింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. ఆయనతో ప్రముఖ నటులు బ్రహ్మానందం పుంబాగా అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నారు.

ఇక ఈనెల 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ అద్భుతమైన అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ “డిస్నీ బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్ నాకెంతో ఇష్టం. డిస్నీతో ఈ అసోసియేషన్ వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. డిసెంబర్ 20న తెలుగులో బిగ్ స్క్రీన్‌పై ముఫాసా: ది లయన్ కింగ్‌ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు చూస్తారని ఎదురు చూస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News