- Advertisement -
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కెసిఆర్ కుటుంబ అవినీతిని బయట పెట్టిందని అన్నారు. మహేష్ మీడియాతో మాట్లాడుతూ..బిజెపి డిమాండ్ చేసినట్టే కాళేశ్వరంపై విచారణ సిబిఐకి అప్పగించామని, కాళేశ్వరంపై సిబిఐ విచారణ పూర్తి చేసి బిజెపి నిబద్ధత చాటుకోవాలని సూచించారు. 42 శాతం బిసి రిజర్వేషన్లను బిఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. బిఆర్ఎస్ అవినీతిని ప్రజలు నమ్మారు కాబట్టే వారిని గద్దె దించారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read : కాంగ్రెస్ మాత్రం బిఆర్ఎస్ ను కాపాడుతూ ఆలస్యం చేసింది: బండి
- Advertisement -