- Advertisement -
ముంబైపుణె ఎక్స్‌ప్రెస్ వే పై శనివారం మధ్యాహ్నం 20 వాహనాలు ఢీకొని దాదాపు 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని నవీ ముంబైలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో చికిత్స పొందుతూ ఒక మహిళ చనిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో సొరంగ ప్రవేశ ద్వారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైవే లోని లోనావాలా ఖండాల ఘాట్ వద్ద కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ముందున్న అనేక వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు కార్లతోసహా సుమారు 20 వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో అనేక వాహనాలు కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. కంటైనర్ ట్రాయిలర్ డ్రైవర్‌ను ఖొపోలీ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలో ప్రమాద సమయంలో డ్రైవర్ ఆల్కహాలు సేవించి ఉండలేదని తేలింది.
- Advertisement -