Saturday, September 21, 2024

వాయనాడ్ లో సకాలంలో వంతెన నిర్మించిన మహిళా సైనిక అధికారిణి బృందం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: మద్రాస్ ఇంజినీర్ గ్రూప్(ఎంఈజి) అండ్ సెంటర్, బెంగళూరుకు చెందిన మేజర్ సీతా అశోక్ షెల్కే (35) తన 144 మంది బృందంతో వాయనాడ్ లో రెండు రోజుల్లో బెయిలీ బ్రిడ్జి నిర్మించి ప్రశంసలు అందుకున్నారు. స్థానికులు, అధికారులు ఆమె టీమ్ కృషిని అభినందించారు.

మేజర్ సీతా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు చెందిన గడిల్గావ్ గ్రామానికి చెందినామె. ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీలయినంత త్వరగా బ్రిడ్జి నిర్మించడంపైనే తాము దృష్టి పెట్టినట్టు తెలిపారు. ‘‘ అనేక ఛాలెంజ్ లు ఎదుర్కొన్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా మేము శిక్షణ పొందాము. స్థానిక అధికారులు, స్థానిక వాసులు మాకు ఎంతో సహాయ సహకారాలు అంధించారు. వాలంటీర్లు కూడా ఎంతగానో తోడ్పడ్డారు’’ అని తెలిపారు. మేజర్ సీతా ఇదివరలో జమ్మూకశ్మీర్ హైవే నం.1-ఏ నిర్మాణ పనుల్లో కూడా బాధ్యత తీసుకున్నారు.

Bailey Bridge

Major Sita team

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News