Saturday, October 5, 2024

మాళ‌వికా మోహ‌నన్ ‘క్రిస్టి’ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

మాథ్యూ థామస్, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘క్రిస్టి’. అల్విన్ హెన్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను పృథ్వీరాజ్‌, మంజు వారియ‌ర్‌, జ‌య‌సూర్య‌, టోవినో థామ‌స్‌, జో మాథ్యు, న‌వీన్ పౌలీ, స‌న్నీ వానె, ఉన్ని ముకుంద‌న్‌, బాసిల్ జోసెఫ్‌, అంథోని పేపె ఫ‌స్ట్ త‌మ సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేశారు. స్టార్ రైట‌ర్స్ బెన్‌య‌మిన్‌, జి.ఆర్‌.ఇందుగోప్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.

రాకీ మౌంటెయిన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై స‌జ‌య్ సెబాస్టియ‌న్‌, క‌న్న‌న్ స‌తీశ‌న్ ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని తిరువ‌నంత‌పురంలోని పూవ‌ర్, మాల్దీవ్స్  లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News