Friday, April 19, 2024

మలేషియా కొత్త ప్రధానిగా అన్వర్

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్: మలేషియా ప్రధాని కావాలనుకున్న అన్వర్ ఇబ్రాహీం గురువారం నెరవేరింది. ఆయన ఇందుకు అనేక ఎగుడుదిగుడులు చవిచూశారు. 75 ఏళ్ల ఆయన రాజకీయంగా గెలుపోటములు చూశారు. దశాబ్దాలుగా ఆయన ప్రధాని కావాలనుకున్నారు. ఎన్నికల ఫలితాలు ఎటూ తేలక రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడ్డంతో మలేషియా రాజు ప్రధానిగా ఆయన పేరును సూచించారు. అన్వర్ 1947లో జన్మించారు. ఆయన తండ్రి ఇబ్రాహీమ్ అబ్దుల్ రహ్మాన్ మాజీ పార్లమెంటు సభ్యుడు. ఆయన తల్లి చె యాన్ హైసైన్ ఉత్తరాది రాష్ట్రం పెనాంగ్‌లో రాజకీయ ఆర్గనైజర్‌గా ఉండేది. అప్పట్లో మలేషియా బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగంగా ఉండేది.

అన్వర్ 1982లో యునైటెడ్ మలైస్ నేషనల్ ఆర్గనైజేషన్(యుఎంఎన్‌ఓ)లో చేరారు. 1990 దశకంలో ఆయన ఆర్థిక మంత్రిగా, ఉప ప్రధానిగా ఎదిగారు. నాడు మహతీర్ మొహమ్మద్ మలేషియా ప్రధానిగా ఉండేవారు. 1997-98లో ఆసియా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు వారి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. కొందరు రాజకీయ పరిశీలకులు అన్వర్ ప్రధాని కావాలనుకుంటున్నాడని పేర్కొన్నారు. దాంతో మహతీర్ అతడిని పదవి నుంచి తొలగించాడు. అంతేకాక అన్వర్ యుఎంఎన్‌ఓ నుంచి బహిష్కృతుడయ్యాడు. అతడిపై అవినీతి, అసభ్య మైథునం ఆరోపణలు కూడా వచ్చాయి. 1999లో అతడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ తర్వాతి సంవత్సరం అతడికి మరో తొమ్మిదేళ్ల జైలు శిక్షను పొడగించారు. ఆ రెండు జైలు శిక్షలు కొనసాగాయి.

మలేషియా సుప్రీంకోర్టు 2004లో అన్వర్‌పై ఉన్న అసభ్య మైథునం ఆరోపణను కొట్టివేస్తూ అతడి స్వేచ్ఛకు ఉత్తరువులు జారీ చేసింది. ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాత 2013లో రాజకీయాలలోకి వచ్చాడు. అతడి కూటమి 50.87 శాతం ఓట్లు గెలుచుకుంది. కానీ పార్లమెంటులో మెజారిటీ సాధించలేకపోయింది. ఆరుగురు పిల్లలకు తండ్రి అయిన ఆయనపై వివాదాలు కొనసాగాయి. మళ్లీ అతడిని 2015లో ఐదేళ్ల కోసం జైలులో పడేశారు. కాగా తాను నిరపరాధినని ఆయన మలేషియా రాజుకు మొరపెట్టుకున్నాడు. మలేషియా రాజు ఆయనకు క్షమాభిక్ష పెట్టాడు. దాంతో అతడు ఉప ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే పార్లమెంటులోకి ప్రవేశించాడు. కాగా అన్వర్ గురువారం ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన “ మలేషియా ప్రజలు కొత్త దిశను కోరుకుంటున్నారు. మార్పును కోరుకుంటున్నారు” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News