Tuesday, November 12, 2024

ఆ సన్నివేశాల్లో ఇబ్బందిపడ్డా… కానీ ఆయన నాకు రెక్కలు ఇచ్చారు: మల్లికా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండు సంవత్సరాల తరువాత మల్లికా శెరావత్ రెండో ఇన్నింగ్స్ ఘనంగా ప్రారంభించారు. ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ సినిమాలో మల్లికా నటించారు. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మల్లికా శెరావత్ మీడియాతో మాట్లాడారు. సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో గొప్ప వ్యక్తులను కలవడంతో తనకు తాను మార్చుకున్నానని వివరణ ఇచ్చారు. మర్డర్ సినిమాలో బోల్డ్ సన్నివేశాలకు షూటింగ్ చేసేటప్పుడు ఎంతో మంది ఉండేవారని, అందరి ముందు బోల్డ్ సన్నివేశాలు చేయడంతో ఇబ్బందిగా ఉండేదన్నారు.

బోల్ట్ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందుల లేకుండా మహేశ్ భట్ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారని ప్రశంసించారు. అందుకే బోల్ట్ సన్నివేశాల్లో సౌకర్యవంతంగా నటించాగలిగానని మల్లికా తెలియజేశారు. ఒక విధంగా చెప్పాలంటే మహేశ్‌ భట్ తనకు రెక్కలు ఇచ్చారన్నారు. ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’లో రాజ్ కుమార్ రావు, త్రిప్తి డిమ్రి జంటగా నటించారు. ఈ సినిమాకు శాండిల్యా దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఓ జంట పెళ్లి చేసుకున్న తరువాత ఓ కీలక సమయాన్ని వీడియో తీసుకుంటారు. వీడియోకు సంబంధించిన సిడి కనిపించకుండా పోతుంది. ఈ సిడి కోసం ఆ దంపతులు వెతుకుతారు. సిడి దొరికిందా? లేక వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే కథాంశంతో ఈ సినిమాను నిర్మించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News