Saturday, December 14, 2024

బడ్జెట్ అంచానాలు లేకుండా గ్యారెంటీలు ఇవ్వొద్దు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీ య అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పథకాలు, హామీల గ్యారంటీలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. శాసనసభ ఎన్నికలకు సిద్ధం అవుతున్న ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శా ఖల నాయకత్వం బడ్జెట్‌ను పూర్తిగా అంచనా వేయకుండా హామీలను ప్రకటించరాదని ఖ ర్గే కీలక సూచన చేశారు. బడ్జెట్‌పై ప్రణాళిక లేకుండా గ్యారంటీలు ఇస్తే అది ఆర్థిక సవాళ్లకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. అది భవిష్యత్ తరాలకు ప్రతికూలంగా మారుతుందని ఆయన అన్నారు. అన్ని కోణాల్లోను పరిశీలించి హామీలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఖర్గే ఈ మేరకు మీడియాసమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక ప్రణాళిక బాధ్యత ప్రాముఖ్యా న్ని ఖర్గే ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. హామీలను అమలు చేయలేని పక్షంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని
ఆయన హెచ్చరించారు.

ప్రణాళిక లేకుండా హామీలు ఇస్తే ఆ తరువాత వివిధ వర్గాలపై భారం పడుతుందని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు, ఆరు, పది, ఇరవై గ్యారంటీలు అంటూ ఏమీ ప్రకటించడం లేదని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలని ఆయన కోరారు. లేదంటే రాష్ట్రం దివాలా పరిస్థితికి చేరుతుందని ఆయన అన్నారు. రోడ్లు వేసేందుకు డబ్బు లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని ఖర్గే హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాగ్దానం చేసిన ‘శక్తి’ పథకాన్ని సమీక్షిస్తామని కర్నాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఖర్గే ఆ వ్యాఖ్యలు చేశారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (డికెఎస్) ఆ ప్రకటన చేసిన తరువాత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖర్గే మందలించారు.

‘మీరు కర్నాటకలో ఐదు గ్యారంటీలు వాగ్దానం చేశారు. మీ ప్రేరణతో మహారాష్ట్రలో మేము ఐదు గ్యారంటీల వాగ్దానం చేశాం. ఇప్పుడు మీరు వాటిలో ఒక గ్యారంటీని రద్దు చేస్తామని అన్నారు. మీరు వార్తాపత్రికలను అసలు చదవడం లేదని అనిపిస్తోంది. కానీ నేను చదువుతాను. అందుకే మీతో ఇది చెబుతున్నాను’ అని ఖర్గే విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన ఆ ప్రస్తావన చేసినప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఆయన పక్కనే ఉన్నారు. ఖర్గే మందలింపునకు సిద్ధరామయ్య స్పందిస్తూ, ప్రభుత్వం సమీక్షిస్తుందని మాత్రమే ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అన్నారని చెప్పారు. ‘(డిసిఎం) ఏమి చెప్పినా అది వారికి (బిజెపికి) ఒక అవకాశం ఇచ్చింది’ అని ఖర్గే విరుచుకుపడ్డారు. ‘శక్తి’ పథకంపై శివకుమార్ వ్యాఖ్యను బిజెపి అందిపుచ్చుకుంటూ, కాంగ్రెస్ తాము పాలించే హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బడా వాగ్దానలు చేస్తున్నదని, అవి ఆర్థికంగా అమలుకు వీలు కానివని, ప్రజలను వంచించేవని విమర్శించింది. రాహుల్ గాంధీ, ఖర్గే అందుకు క్షమాపణ చెప్పాలని కూడా బిజెపి డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News