Friday, April 19, 2024

మూడు నెలల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పి మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలంలోని ఆయా గ్రామాల్లో బిటి రోడ్లకు శంకుస్థాపన చేసిన తర్వాత భీమవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గ్రూప్- 1, డిఎస్‌సి తదితర ఉద్యోగాల కోసం తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వేశామని వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అధ్న నియోజకవర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలకు పక్కా భవనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని, కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేయనున్నామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మార్చి ఒకటవ తేదీన 6,50,262 మందికి వేతనాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న 3,65,262 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2 లక్షల 85 వేల మంది పెన్షన్‌దారులకు మార్చి ఒకటో తేదీ నాడు వేతనాలను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఉద్యోగులకు నెల వారిగా ఉండే ఈఎంఐ చెల్లింపులు, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంత కష్టమైనప్పటికీ ఒకటో తేదీన వేతనాలు అందించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News