Friday, March 29, 2024

రైళ్ల ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకొనే విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఔదార్యం ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, అలాగే అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కీలక నిర్ణయం ప్రకటించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మానసిక,శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదుసాయం అందిస్తామని తెలిపారు.

మంగళవారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తానని ప్రకటించారు. బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని, ఒడిశా లోని వేర్వేరు ఆస్పత్రుల్లో వీరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉందని వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు బుధవారం ఎక్స్‌గ్రేషియో చెక్కులు, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తారు. ప్రయాణికుల చికిత్స, పునరావాసం పర్యవేక్షించడం కోసం అంతకు ముందు తన నాలుగు రోజుల డార్జిలింగ్ పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News