Thursday, May 1, 2025

400 సరే… 200 సీట్లైనా గెలవమనండి: బిజెపికి మమతా సవాల్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని, అయితే 200 మార్కును దాటాలని ఆ పార్టీకి తాను సవాల్ చేస్తున్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాలు విసిరారు. 2021అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో 200కు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ప్రగల్బాలు పలికిందని, అయితే కేవలం 77 సీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. తలగాయం నుంచి కోలుకున్న బెనర్జీ తొలిసారి బహిరంగంగా మాట్టాడారు. టిఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు.

బీజేపీకి వ్యతిరేకంగా మొయిత్రా గళం విప్పినందున ఆమెపై దుష్ప్రచారం చేసి లోక్‌సభ నుంచి బహిష్కరించారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఎఎ) బెంగాల్‌లో తాము అమలు చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. సీఎఎకు దరఖాస్తు చేయడం వల్ల విదేశీయులుగా మారతారని, అందుకే సిఎఎకు దరఖాస్తు చేయవద్దని ఆమె ప్రజలను హెచ్చరించారు. ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం పై మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ లో సిపిఎం, కాంగ్రెస్ కలిసి బీజేపీ కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News