Saturday, July 27, 2024

వలస కార్మికులకు మమత బెనర్జీ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: ఈద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు వచ్చిన వలస కార్మికులు ఓటేయకుండా వెళితే వారికే నష్టమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ముర్షీదాబాద్ లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆమె ఈ హెచ్చరిక చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓటు వేయని వాళ్ల ఆధార్, పౌరసత్వాన్ని ఊడ లాక్కుంటారని ఆమె హెచ్చరించారు. ఉమ్మడి పౌరస్మృతిని బిజెపి ప్రభుత్వం తీసుకొస్తే వలస కార్మిక ముస్లింలంతా తమ గుర్తింపును కోల్పోతారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్, జల్పాయ్ గురి(ఎస్సీ), అలిపురుద్దూర్ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News