Monday, April 29, 2024

కుమారస్వామితో మమత భేటీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన నివాసంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామితో సమావేశమయ్యారు. అంతకు ముందు నగరానికి చేరుకున్న కుమారస్వామి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మమత నివాసానికి వచ్చారు. ఇరువురు నేతలు దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించినట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి.

ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా మమత బిజెపియేతర, కాంగ్రెసేతర పార్టీల నేతలతో వరసగా భేటీలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే కుమారస్వామితో సమావేశమయ్యారని పార్టీ నేతలు చెప్పారు. అంతకు ముందు నగరానికి చేరుకున్న కుమారస్వామి విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని లోక్‌సభనుంచి అనర్హుడిగా ప్రకటించడాన్ని బిజెపి రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News