Friday, June 2, 2023

గోదావరి తీరంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల తడపకల్ గ్రామ శివారులో గల గోదావరి నది తీరంలో ఉన్న రామాలయం దగ్గర గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏర్గట్ల ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని తడపకల్ గ్రామ శివారులోని రామాలయం వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారం మేరకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పట్టుకొని విచారించగా వారి వద్ద 400 గ్రాముల గంజాయి లభించినట్లు ఎస్సై తెలిపారు.

పట్టుకున్న గంజాయి విలువ సుమారుగా 7000 వరకు ఉంటుందని తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న నిందితులు బస్టాండ్ దగ్గర భీముని దుబ్బా కోరుట్ల మండలానికి చెందిన పూసల వెంకటేష్ తండ్రి సుధాకర్, మరొకరు అదే మండలానికి చెందిన గోడికే నవీన్ తండ్రి కిషన్ గాంధీ రోడ్ కోరుట్ల గుర్తించినట్లు తెలిపారు. గంజాయిని సీజ్ చేసి వారిని ఆరెస్టు చేసి రిమాండ్ కొరకు కోర్టుకు పంపామని ఆయన వెల్లడించారు. గంజాయి ఎవరైనా విక్రయించిన, సమాచారం ఇవ్వాలని కోరారు. ఎక్కడైనా అమ్మినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News