Tuesday, February 7, 2023

మూడేళ్ల క్రితం కొడుకును.. నేడు భార్యను

- Advertisement -

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో భార్యను ఓ భర్త కిరాతకంగా హత్యచేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్క గంగవ్వ ఆదివారం మధ్యాహ్నం తమ పొలంలో నాటు వేస్తుండగా భర్త నక్క రమేష్ కత్తితో వెళ్లి ఆమెను పొడిచి ప్రాణాలు తీశాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పెగడపల్లి ఎస్సై శ్వేత, మల్యాల సిఐ రమణమూర్తి చేరుకొని విచారణ చేపట్టారు.

కాగా కిరాతక భర్త రమేష్ మూడేళ్ల క్రితం సొంత కొడుకును హత్య చేశాడు, నేడు భార్యని కూడా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles