- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్య, అత్తను కత్తెరతో పొడిచి చంపేశాడు. నిందితుడిని యోగేశ్ సెహెగల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు తన భార్య ప్రియా సెహెగల్(34), అత్త కుసుం సిన్హా(63)ను ఇంట్లోనే పొడిచి చంపేశాడు. ఆగస్టు 28న తన కుమారుడు చిరాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన కానుక విషయంలో పేచీ వచ్చి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంట హత్యలకు కుటుంబ కలహమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
- Advertisement -