- Advertisement -
మన తెలంగాణ/మానకొండూర్: మండలంలోని శ్రీనివాస్‌నగర్ జగ్గయ్యపల్లి గ్రామాల శివారులోని ఓ వ్యవసాయలో మృతదేహం లభించింది. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన జి ఆంజనేయులు అనే వ్యక్తి మృతదేహం లభించినట్లు స్థానికులు తెలిపారు. వ్యవసాయ బావి గట్టుపై ద్విచక్రవాహనం, హెల్మట్ లభించినట్లు తెలిపారు. మృతదేహం నీటిలో కుళ్లినట్లు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మానకొండూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -