Saturday, September 30, 2023

భార్యా భర్తల మధ్య గొడవ..పురుగుల మందు తాగి భర్త మృతి

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తి: భార్యా భర్తలు నడుమ గొడవపడి మనస్థాపానికి గురై భర్త మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన వెల్దుర్తిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మధుసూదన్‌గౌడ్, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… వెలుర్తి గ్రామానికి చెందిన నాగరాజు(38) ఇతనికి 18 సంవత్సరాల క్రితం గుమ్మడిదల గ్రామానికి చెందిన మాధవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఒక 15 సంవత్సరాల కుమారుడు, 13 సంవత్సరాల కూతురు ఉన్నారు. కాగా గత సంవత్సరం నుండి మాధి పిల్లల్ని భర్త దగ్గర వదిలి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ప్రతి సారి తన భార్యను నాగరాజు బ్రతిమిలాడి తీసురావడం మళ్లీ గొడవ పడి వెళ్లిపోవడం జరిగింది.
ప్రతీసారి ఇలా జరుగడంతో నాగరాజు తీవ్ర మనస్థాపానికి గురయ్యా డు. కాగా గత వారం రోజుల క్రితం నాగరాజు తన భార్య మాధవిని తన అమ్మవాళ్లతో మాట్లాడి ఇంటికి తీసుకొని వచ్చాడు. కాగా శనివా రం రాత్రి మళ్లీ భార్యభర్తల మధ్య గొడవ పడ్డారు. దీంతో మాధవి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోతానని చెప్పడంతో నాగరాజు తీవ్రమనస్థాపానికి గురై ఇంటిలో ఉన్న గడ్డి మందు త్రాగి కింద పడిపోగా అతని త మ్ముడి కుమారుడు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా ఆదివారం నాగరాజు మృతి చెందాడు. అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్‌గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News