Wednesday, May 28, 2025

వర్షపు నీటిలో మునిగి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

సూరారం పోలీస్ స్టేషన్ పరిధి సూరారం కాలనీ లో వర్షపు నీటిలో మునిగి పద్మారావు (40)అనే వ్యక్తి మృతి చెందాడు. గత కొద్ది సేపటిగా కురుస్తున్న వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో నిద్రపోయిన పద్మారావు కు ఊపిరాడక మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మద్యం మత్తులో ఉండటం వల్లనే మృతి చెందాడని పోలీసుల నిర్ధారణ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News