Wednesday, July 24, 2024

పందెం కోసం ప్రాణం బలి

- Advertisement -
- Advertisement -

పందెం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండ లం చందిప్ప గ్రామానికి చెందిన సురేశ్ వ్యవసాయ పొలం వద్ద ఉండగా సరదాకోసం గడ్డిమందు తాగితే లక్ష రూపాయాలు ఇస్తామని చెప్పి మిత్రు లు పందెం వేశారన్నారు. దీంతో సురేశ్ పందెంలో గెలవాలన్న లక్షంతో గడ్డిమందును తాగాడన్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న సురేశ్‌ను సం గారెడ్డి ఆస్పత్రికి తరలించారని, మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుడికి భార్య అనితతో పాటు ఇద్దరు కూతుళ్లు నవీన, నందిత ఉన్నారని, మృతుడి అన్న సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు శంకర్‌పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News