Saturday, December 14, 2024

భార్య పిల్లల్ని కాల్చి చంపి ఆపై భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగింది. భదాయిని ప్రాంతంలో నివసించే రాజేంద్రగుప్తా ఇంటి తలుపులు మంగళవారం తెరుచుకోలేదు. అయితే ఇంట్లోకి వెళ్లి చూసిన పనిమనిషి షాక్ అయ్యింది. రాజేంద్రగుప్తా భార్య 45 ఏళ్ల నీతూ, పిల్లలు 25 ఏళ్ల నవనీంద్ర, 16 ఏళ్ల గౌరాంగి, 15 ఏళ్ల శుభేంద్ర గుప్తా కాల్పుల గాయాలతో మృతి చెంది ఉన్నారు. పోలీస్‌లు అక్కడకి వచ్చిన తరువాత పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఒక గంట తర్వాత ఒక నిర్మాణ స్థలం వద్ద రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని పోలీస్‌లుగుర్తించారు.

నిద్రలో ఉన్న భార్యా బిడ్డలను కాల్చి చంపిన తరువాత గుప్తా తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీస్‌లు అనుమానిస్తున్నారు. అనేక హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజేంద్రగుప్తా ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడని పోలీస్‌లు తెలిపారు. రెండో భార్య అయిన నీతూతో గొడవ వల్లనే తన కుటుంబీకులను చంపాడని అనుమానిస్తున్నారు. రాజేంద్ర గుప్తాకు పది ఇళ్లు ఉన్నాయి. నెలకు లక్షల్లో అద్దె వస్తోందని పోలీస్‌లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్తి వివాదం కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News